Authorization
Mon March 03, 2025 06:20:35 pm
నవతెలంగాణ - చెన్నై: ఆరుద్ర గోల్డ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దుబాయ్లో తలదాచుకుంటున్న సినీ నటుడు, నిర్మాత ఆర్.కె.సురేష్(RK Suresh)కు చెందిన బ్యాంకు ఖాతాలను చెన్నై నగర ఆర్థిక నేరాల విభాగం పోలీసులు స్తంభింపజేశారు. అలాగే, ఆయన ఆస్తులను కూడా సీజ్ చేసే విషయంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుద్ర గోల్డ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డైరెక్టర్లలో ఒకరైన రూసోను కేసు నుంచి విముక్తిడిని చేసేందుకు ఆర్.కె. సురేష్ రూ.13 కోట్ల మేరకు తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్లో ఉంటున్నారు. దీంతో ఆయన బ్యాంకు ఖాతాలను పోలీసుల సీజ్ చేశారు.