Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ షాక్ ఇచ్చింది. తీవ్రమైన నగదు కొరత ఏర్పడిందని పేర్కొంటూ వాడియా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ స్వచ్ఛందంగా దివాలా పిటిషన్‌ను దాఖలు చేసిన తర్వాత డీజీసీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది. రద్దు చేసిన, సస్పెండ్ చేసిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బును తిరిగి చెల్లించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం ఎయిర్‌లైన్ గోఫస్ట్‌ను కోరింది.
సమయపాలన ప్రకారం ప్రయాణీకులకు డబ్బును వాపసు చేయాలని డీజీసీఏ ఉత్తర్వును జారీ చేసింది.గో ఫస్ట్ కూడా మే 15వతేదీ వరకు విమాన టిక్కెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ షెడ్యూల్డ్ కార్యకలాపాలను నిలిపివేయాలని గో ఫస్ట్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని డీజీసీఏ తెలిపింది.