Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మాదాపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో.. కంపెనీ యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్‌కు చేరుకున్న పోలీసులు.. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని నిర్ధారించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.