Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్ప్రింటర్ టోరీ బౌవీ ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె వయసు 32 ఏళ్లు. రియో ఒలింపిక్స్‌లో ఆమె మూడు పతకాలు గెలిచారు. 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో గోల్డ్, 100 మీటర్ల రిలేలో సిల్వర్, 200 మీటర్ల రేస్‌లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. ఫ్లోరిడాలోని ఓర్లాండాలో ఉన్న ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
ఐకాన్ మేనేజ్మెంట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టోరీ గురించి రాసింది. ఈ విషాధ వార్తను షేర్ చేసుకోవడం బాధాకరంగా ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఆకస్మికంగా చనిపోవడం షాకింగ్‌గా ఉందని ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ తెలిపారు. అథ్లెట్ బౌవీ .. మిస్సిసిపీలో జన్మించింది. యవ్వనంలో ఆమె బ్లాస్కెట్బాల్ ఆడింది. అథ్లెటిక్ స్కాలర్షిప్ అందుకున్న తర్వాత ఆమె సక్సెస్ఫుల్ అథ్లెట్‌గా మారింది. ఆ తర్వాత ఇండోర్, ఔడోర్ టోర్నీల్లోనూ ఆమె మెరుగ్గా రాణించింది.