Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ ఈ రమేష్ బాబు
నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ లోవిద్యుత్ వారోత్సవాల్లో భాగంగా గురువారం విద్యుత్ భద్రత వారోత్సవాలు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా ముఖ్య అతితి గా పాల్గొన్న విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేశ్ బాబు గోడ పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఒకవేళ నిర్లక్ష్యం వహించితే నిండు ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. మరియు వినియోగదారులు తడిచేతులతో విద్యుత్ స్విచ్ బోర్డులను తాకరాదని వ్యవసాయ బోర్ల వద్ద కెపాసిటర్ బిగించాలని మరియు సర్వీస్ వైర్లు మరమ్మత్తులు నిర్వహించవద్దని ఏదైనా ఇబ్బంది ఉంటే విద్యుత్ సిబ్బంది చే చేయించాలని కోరారు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజు వైర్లు మరియు అనధికారంగా విద్యుత్ ఏబి స్విచ్ ఆపరేట్ చేయరాదన్నారు ఈసమావేశంలో డి ఈ గణేష్ , డి ఈ టెక్నికల్, ఏ ఈ సతీష్ రెడ్డి గాంధారి సర్పంచ్ మమ్మాయి సర్పంచ్ సంజీవ్ యాదవ్, లైన్ మెన్ కొండల్ రెడ్డి, జూనియర్ లైన్ మెన్లు శ్రీనివాస్,స్వామి విద్యుత్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు