Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ పదహారో సీజన్ 47వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో హ్యాట్రిక్ ఓటములకు హైదరాబాద్ గుడ్ బై చెప్పింది. మరోవైపు కోల్‌కతా ప్రదర్శన కూడా ఆ మాత్రంగానే ఉంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా కూడా ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కతా 8వ, హైదరాబాద్ 9వ స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్ వరకు వెళ్లాలంటే ఇరుజట్లు ఇకపై ప్రతి మ్యాచ్ భారీ ఆధిక్యంతో గెలవాలి. తొలి రౌండ్లో.. ఈడెన్ గార్డెన్స్‌లో హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టడంతో హైదరాబాద్ కోల్‌కతాకు షాకిచ్చింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. మరి, ఉప్పలో స్టేడియంలో మరక్రం సేన పంజా విసురుతుందా? రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగిస్తాడా? అనేది చూడాలి.