Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల మృతి చెందిన మహబూబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య పెద్ద కుమారుడు మంకిడి ప్రదీప్ కిరణ్ దశదినకర్మకు ఐటీడీఏ పీవో అంకిత్, డిడి పోచం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టర్ తస్లీమా మహమూద్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరరావు, జిల్లా బిసి వెల్ఫేర్ చైర్మన్ లక్ష్మణ్, సామాజిక న్యాయవేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, విద్యార్థి విభాగం నాయకులు కొప్పుల రవీందర్, ఎస్సీ ఎస్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మాడే బిక్షపతి, వికారాబాద్ తాండూర్ డి ఈ ఎట్టి వెంకన్న, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీస్ ప్రొప్రైటర్ ఎట్టి నిర్మల, టి యు టి డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణ ప్రసాద్, ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంకిడి బుచ్చయ్య, ఆదివాసి ఉపాధ్యాయ జెఎసి మాజీ అధ్యక్షులు కొమరం నరసయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, మంగపేట మాజీ ఎంపిటిసి అయ్యోరి యానయ్య, సి ఆర్ టి ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కొండ రామయ్య పోదెం రవీందర్, మండల ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సర్పంచులు, నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన జ్ఞాపకార్థం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంత చిన్న వయసులో మృత్యు చెందినందుకు బంధువులు, కుటుంబ సభ్యులు అన్నింటి పర్యంతమయ్యారు.