Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-50 వేల మందితో భారీ బహిరంగ సభ
- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
-గులాబీ మయమైన హుస్నాబాద్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
బీ అర్ ఎస్ పార్టీ బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ, శంఖు స్థాపనలు చేసేందుకు ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం తొలిసారిగా హుస్నాబాద్ కు రానున్నారు. దీంతో హుస్నాబాద్ గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీ లతో గులాబీ మయమైంది.
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సతీష్ ..
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ బహిరంగ సభ ఏర్పాట్లును పర్యవేక్షించారు. 50 వేల మంది పైగా జనాన్ని నియోజకవర్గం నలు మూలల నుండి తరలివచ్చేందుకు, జన సమీకరణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొదటిసారి హుస్నాబాద్ కు వస్తున్న మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో గులాబీ పార్టీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమాలవద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇప్పటికే రెండు సార్లు సంబంధిత ప్రదేశాలు సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. కేటీఆర్ తో పాటు పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సభకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ తనయుడు యువనేత ఇంద్రనీల్ వొడితల గురువారం హుస్నాబాద్ పట్టణంలో పర్యటించి యూత్, విద్యార్ధి నాయకుల్లో ఉత్సాహం నింపారు. కేటీఆర్ సభా స్థలి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు ..
-ఉదయం 10-00 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాఫ్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా స్థానిక ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకుంటారు.
-10-30 గంటలకు రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం కు ప్రారంభోత్సవం,అలాగే రూ. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన ఎస్టీ బాలికల హాస్టల్ ను ప్రారంభిస్తారు. రూ. 16 కోట్ల 46 లక్షల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవం చేస్తారు .
-ఉదయం 11-00 గంటలకు : రూ. రెండుకోట్ల వ్యయంతో నిర్మించిన ఉపాధ్యాయ శిక్షణ భవనాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం రూ. 10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గోడంగడ్డలో ప్రారంభిస్తారు.
-ఉదయం 11-15 గంటలకు: రూ. కోటి ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు.
-ఉదయం 11-20 గంటలకు: రూ. 3 కోట్ల 50 లక్షలతో ఎల్లమ్మ చెరువు వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులకు భూమిపూజ చేస్తారు.
-ఉదయం 11-30 గంటలకు: బస్ డిపో వద్ద జరిగే బహిరంగ కు హాజరవుతారు
మధ్యాహ్నం 01-30 గంటలకు: సెయింట్ జోసెఫ్ పాఠశాలలో భోజనం అనంతరం 2-30 గంటలకు హనుమకొండకు హెలికాఫ్టర్ ద్వారా వెళ్తారు.