Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. కమల్ హాసన్ వంటి ప్రముఖుడు సైతం సోషల్ మీడియాలో ప్రచారం నిజమని నమ్మి, శరత్ బాబు ఇక లేరంటూ సంతాపం తెలిపి, ఆ తర్వాత తన ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఏఐజీ ఆస్పత్రి శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చింది. శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వెంటిలేటర్ పైనే ఉన్నారని వివరించింది. ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐజీ ఆసుపత్రి ఓ బులెటిన్ విడుదల చేసింది. ఆస్పత్రి వర్గాలు కానీ, శరత్ బాబు కుటుంబ సభ్యులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తుంటారని ఆ బులెటిన్ లో పేర్కొంది.