Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్ స్టేడీయంలో హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్ కతా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సన్ విసిరిన తొలిబంతికి ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అవుటయ్యాడు. ఆదే ఓవర్ చివరి బంతికి ప్రమాదకర వెంకటేశ్ అయ్యర్ (7) అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేసన్ రాయ్ (20) కార్తిక్ త్యాగి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక 96 పరుగుల వద్ద నితిష్ రాణా (42) మార్కరామ్ అవుట్ చేశారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 13 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో రింకు సింగ్ 25, రస్సేల్ 14 పరుగులతో ఉన్నారు.