Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డిడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షులు రాజలింగం
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
జర్నలిస్టుల సమిష్టి కృషితో సమస్యలు పరిష్కారం అవుతాయని డిడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షులు రాజలింగం అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అపోలో ఒకేషనల్ కళాశాలలో డిడబ్ల్యూజేఎస్ వార్షికోత్సవ డివిజన్ స్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షులు బోడుమల్ల సంపత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజలింగం మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సంక్షేమం కోసం డిడబ్ల్యూజేఎస్ కృషి చేస్తుందన్నారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ లను జిల్లాలోని ప్రతి జర్నలిస్టుకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిడబ్ల్యూజేఎస్ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడ్వైజర్ ప్రసాద్, పి ఆర్ ఓ నర్సన్న, డివిజన్ అధ్యక్షులు బోడుమల్ల సంపత్, ఉపాధ్యక్షులు జాకబ్, కోశాధికారి జాల శ్రీనివాస్, సావుల శ్రీనివాస్, గడిపే నర్సింగరావు, గడిపే సతీష్, లింగాల ప్రవీణ్, పోడిశెట్టి కుమార్, కమలాకర్, జితేందర్, శ్రీనివాస్, నవజీవన్, సావుల వేణు తదితరులు పాల్గొన్నారు.