Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో థాయ్‌లాండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని నెగ్గిన జట్టుగా థాయ్‌లాండ్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఇవాళ బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్, మలేషియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ జట్టు 18.3 ఓవర్లలో 53 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
దాంతో మలేషియా విజయం ఖాయమని అంతా భావించారు. కానీ థాయ్‌లాండ్ జట్టు మలేషియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. థాయ్ బౌలర్ల ధాటికి మలేషియా టీమ్ 15.3 ఓవర్లలో 41 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. థాయ్‌లాండ్‌కు విజయం దక్కింది. కేవలం 53 పరుగులు చేసి ప్రత్యర్థిని ఆలోపే కట్టడి చేయడం ద్వారా ఇప్పటివరకు బంగ్లాదేశ పేరిట ఉన్న రికార్డును థాయ్‌లాండ్ తిరగరాసింది.
అతితక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించిన జట్టుగా రికార్డు ఇప్పటివరకు బంగ్లాదేశ్ పేరిట ఉంది. 2012లో శ్రీలంకతో జరిగిన మహిళల టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 62 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీలంకను 62 పరుగుల లోపే కట్టడి చేసి అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును థాయ్‌లాండ్ జట్టు తన పేరిట లిఖించుకుంది.