Authorization
Mon March 03, 2025 01:01:38 am
నవతెలంగాణ-హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న పర్యవేక్షణ అధికారులతో పాటు బోధన సిబ్బంది బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 59 కేజీబీవీల్లో పని చేస్తున్న 680 మందికి లబ్ధి చేకూరనున్నది. నేటి నుంచి దరఖాస్తులకు అవకాశం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న బోధన సిబ్బంది, ప్రత్యేకాధికారులు, పీజీ సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం బదిలీ కౌన్సెలింగ్ జరుగనుంది. బదిలీల కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా అదనపు కలెక్టర్, మెంబర్ సెక్రటరీగా డీఈఓ వ్యవహరిస్తారు.