Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోటుచేసుకున్నది. బేగంపేట ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ యాకత్పురాకు చెందిన షేక్ కైసర్ (28), షేక్ ముస్తఫా(3), జద్గిరిగుట్టకు చెందిన అహ్మద్ సోహైల్(17) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లిలో తమ బంధువుల ఇంటికి వచ్చారు.
అనంతరం సామలపల్లిలోని సామలచెరువు గట్టు సమీపంలోని బంధువుల వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లారు. చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతూ మొదట ముస్తఫా చెరువులో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడం తో ముగ్గురూ మృత్యువాత పడ్డా రు. మృతదేహాలను గజ్వేల్ ప్రభు త్వ దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చే స్తున్నట్టు ఎస్సై అరుణ్ తెలిపారు.