Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లండన్: బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మే 6న జరగనున్న ఈ వేడుకకు వెస్ట్మిన్స్టర్ అబే చర్చిని వేదికగా నిర్ణయించారు. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి బ్రిటన్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. క్వీన్ ఎలిజబెత్ వివాహం, పట్టాభిషేకం, ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలు వెస్ట్ మిన్స్టర్ అబేలోనే జరిగాయి. కాగా, కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి 2,200 మందికి ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందగా ఆమె బదులు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరుకానున్నారు.