Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోధన్, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది. దీంతో రైతుల్లో మరోమారో గుబులు రేపుతోంది. ధాన్యం రాశులు తడిసి ముద్దయిన పరిస్థితులలో ఆరబెట్టుకునే సమయమే చిక్కకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్లోను వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో మోస్తరు వర్షాలు కురిశాయి. ముధోల్, కుబీర్, భైంసా, కుంటాల, తానూర్ మండలాల్లో కూడా వాన కురుస్తున్నది.