Authorization
Mon April 07, 2025 09:07:22 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని విజయపురిలో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. అన్న దమ్ముల మధ్య గొడవలో బావ మృతి చెందాడు. రూ. 2వేల పింఛన్ కోసం అన్నదమ్ముల మధ్య కొట్లాట జరిగింది. అన్నదమ్ముల గొడవ ఆపేందుకు మధ్యలో బాధితుడు వెళ్లాడు. ఘర్షణలో కిందపడి రాయి తలకు తగిలి బావ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.