Authorization
Sun March 02, 2025 09:29:30 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. బ్రాండ్లతో నిమిత్తం లేకుండా ఒక్కో ఫుల్బాటిల్పై రూ.40, 375 ఎంఎల్పై రూ.20, 180 ఎంఎల్పై రూ.10 మేర ధరలను తగ్గించింది. బీర్ల ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. కొత్త ధరలు తక్షణం అమల్లోకి రానున్నాయి. గురువారం వరకు మద్యం దుకాణాలు, డిపోల్లో నిల్వ ఉన్న స్టాకును మాత్రం పాత ధరలకే అమ్ముకునేందుకు వ్యాపారులకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం నుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై కొత్త ధరలుంటాయి. వాటి ప్రకారమే విక్రయించాల్సి ఉంటుంది. మారిన ధరల్ని మద్యం దుకాణాల్లో ప్రదర్శించాలని ఆబ్కారీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మే నెలలోనే తొలిసారిగా మద్యం ధరలు పెంచారు. తాజా తగ్గింపుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులు ఈ విషయాల్ని వెల్లడించారు.