Authorization
Mon April 07, 2025 08:04:29 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, దుండిగల్, మల్లంపేట, గండిమైసమమ, సూరారం, గాగిల్లాపూర్, కొండాపూర్‌లో వర్షం పడుతున్నది. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మదీనగూడ, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్‌లోనూ వర్షం కురుస్తున్నది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురవగా.. రోడ్లపై వర్షం నీరు నిలిచింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో వైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.