Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భక్తుల డిమాండ్ మేరకు టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సును శ్రీశైలం క్షేత్రానికి నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్ల నుంచి నడుపుతామని పేర్కొన్నారు. ప్రతి రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు ఎంజీబీఎస్ నుంచి తొలి బస్సు శ్రీశైలం క్షేత్రానికి బయల్దేరనుంది. ఆ తర్వాత ప్రతి అర గంటకు ఒక బస్సు అందుబాటులో ఉండనుంది. ఇక చివరి బస్సు ఎంజీబీఎస్ నుంచి రాత్రి 11:45 గంటలకు శ్రీశైలం బయల్దేరను. శ్రీశైలం నుంచి ప్రతి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు హైదరాబాద్కు ఒక బస్సు బయల్దేరును.
తదితర వివరాల కోసం 9959226248, 9959226248, 9959226257(ఎంజీబీఎస్), 9959226246(కేపీహెచ్బీ), 9959226149(బీహెచ్ఈఎల్) అనే నంబర్లలో సంప్రదించొచ్చు. టికెట్లను www.tsrtconline.in అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.