Authorization
Mon April 07, 2025 08:20:26 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ముందస్తు ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌దే విజయమని చెబుతున్నాయి. గత 40 రోజులుగా హోరెత్తిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకుమించి నమోదయ్యేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.