Authorization
Mon April 07, 2025 09:07:23 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీలో పాలిసెట్ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్- 2023 పరీక్షకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 61 పట్టణాలు 499 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారని ఏపీ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. గతంలో కంటే ఈ సారి పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య అదనంగా 21వేలకు పెరిగిందన్నారు. ఏజెన్సి ప్రాంతాల్లో విద్యార్థులకు కల్పించిన అవగాహన వల్ల 26,698 మంది ఎస్సీ, 9,113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.