Authorization
Thu April 03, 2025 07:13:31 am
నవతెలంగాణ-హైదరాబాద్: రేపు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ భద్రాచలంకు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి భద్రాచలం బయలుదేరతారు. ఉదయం 8:30 గంటలకు గవర్నర్ భద్రాచలం చేరుకోనున్నారు. తొలుత భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలంలోని శ్రీ కృష్ణ మండపంలో హెల్త్ అవేర్ నెస్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. అనంతరం భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్కు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ వెళ్లనున్నారు. అక్కడ గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.