Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు. మృతులు అందరూ 16-17 ఏళ్ల వారేనని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం తొలుత ఇద్దరు బాలురు నదిలోకి దిగి మునిగిపోవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న మరో ముగ్గురు తమ స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించారు. దురదృష్ణవశాత్తూ వారు కూడా మరణించారని బోతాద్ ఎస్పీ కిషోర్ బలోలియా పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.