Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: జవహర్ నగర్లోని పెండ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 11 లక్షల సొత్తుతో దొంగలు ఉడాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫేస్ 1 - 16 బి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి తలుపులు పగలగొట్టి రూ. 3,72,000 విలువ చేసే 6 తులాల బంగారు గొలుసులు, ఉంగరాలు, రూ. 3 లక్షల విలువ చేసే లాప్ టాపులు, రూ. 3,75,000 విలువ చేసే 5 కేజీల వెండి వస్తువులు, రూ. 10 వేలు నగదు చోరీ చేశారు. బులెట్ వాహనం కూడా చోరీకి యత్నించి విఫలమయ్యారు. చెల్లి పెండ్లి వేడుకలు ముగించుకొని అర్థరాత్రి 1 గంటకు ఇంటికి తిరిగి వచ్చే సరికి వెనక డోర్ పగలగొట్టి ఉంది. దీంతో వారు ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.