Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం, బ్రాహ్మణ పల్లి చౌరస్తా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వస్తున్న ఆటో, బైక్ అదుపుతప్పి ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆందోల్ గ్రామానికి చెందిన గౌండ్ల రాములు (29), డాకూర్ గ్రామానికి చెందిన చింతాకి నాగరాజు (24)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. అలాగే మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి అన్నారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో టెక్మాల్కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.