Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా ఈ నెల 16న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపే సభ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రజా సంఘాలు, ప్రయివేటు ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జరగనుందని ఆ సంఘాల నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ప్రగతి భవన్లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు.
అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకున్నావారు ఒక మొక్క నాటి రావాలని పిలుపునిచ్చి హరిత విప్లవానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన ఆలోచన మేరకు మనందరం కూడా మొక్కలు నాటాలని హరిత భారతావనికి కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడం, తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, డిఎన్టీ ఎంబీసీ పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులడు కోల శ్రీనివాస్, టీపీయూఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు గంగాధర్, వడ్డెర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ఐటీ వింగ్ ఐబీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్ గుప్తా, ప్రయివేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మోహన్ నాయక్, ఓయూ జేఏసీ నాయకులు డాక్టర్ సంజీవ్ నాయక్, శివకుమార్, నిపున్ రాజా తదితరులు పాల్గొన్నారు.