Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ తదుపరి డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ విరమణ అనంతరం ప్రవీణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం సాయంత్రం సమావేశమైంది. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. చివరికి ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన తర్వాత ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. సీబీఐ డైరెక్టర్ పదవిలో నియమితులైనవారి పదవీ కాలం రెండేళ్లు. ఆ తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.