Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధ్యప్రదేశ్: అండర్ గ్యాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిలైనందుకు బాలిక కిడ్నాప్ డ్రామాకే తెరతీసింది. తల్లిదండ్రులు తిట్టకుండా ఉండాలని ఫేక్ కిడ్నాపింగ్ కు పాల్పడింది. 17 ఏళ్ల బాలిక బీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫేయిల్ అయింది. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో తాను కిడ్నాప్ అయినట్లు కథ అల్లింది. పరీక్ష ఫలితాలు వెలువడిన కొన్ని గంటల తర్వాత, కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా.. ఇండోర్ లోని ఓ ఆలయం సమీపంలో తన కుమార్తె అపహరణకు గురైందని బాలిక తండ్రి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారని ఇండోర్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర సోని తెలిపారు. తన కుమార్తె ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు గురైనట్లు చెప్పిందని అధికారులకు తెలియజేశాడు. కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ తను ఆలయ సమీపంలో డ్రాప్ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత ఒక ఆటో రిక్షాలో ఎక్కానని, ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోటిలో గుడ్డలు పెట్టిన తర్వాత స్పృహ కోల్పోయానని సదరు బాలిక తండ్రికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే అదంతా తేలిందని పోలీసులు తెలిపారు. ఉజ్జయినిలో ఓ రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చున్న బాలిక గురించి అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె ఫోటోను పంపించడంతో ఆమె ఉజ్జయినిలో ఉందని తెలుసుకుని పోలీసులు బాలికను ఇండోర్ తీసుకువచ్చారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. పరీక్షల్లో ఫెయిలై తల్లిదండ్రులను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడం వల్లే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విచారణలో తేలింది.