Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డెహ్రాడూన్: ముగ్గురిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతుండగా అతడు హత్య చేసిన నాలుగో మృతదేహం లభించింది. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. సంతోష్ రామ్ కుటుంబంలో శుక్రవారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 68 ఏళ్ల అత్త హేమంతి దేవి, ఆమె కుమార్తె, కోడలిని అతడు హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతకసాగారు. అయితే అతడు ఇటీవల కొనుగోలు చేసిన పాత ఇంటికి తాళం వేసి ఉంది. పిల్లలు తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూగా సంతోష్ రామ్ భార్య చంద్రా దేవి మృతదేహం ఆ ఇంట్లో ఉంది. దీంతో నిందితుడు నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, సంతోష్ రామ్‌ను వెతికేందుకు పోలీస్, పీఏసీ, ఎస్డీఆర్ఎఫ్తో కూడిన 60 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో కొండలు, లోయలు, నదీ తీర ప్రాంతాల్లో సర్చ్ చేశారు. రామగంగా నది ప్రవహించే ఎత్తైన కొండల వైపునకు కుక్కలు వెళ్లాయి. దీంతో నిందితుడు సంతోష్ రామ్ కొండ పైనుంచి ఆ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.