Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యప్రతాపం మొదలవుతోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గరిష్ఠంగా 45.9 డిగ్రీలు, జన్నారంలో 45.8, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కల్లో 45.1, నల్గొండ జిల్లా పజ్జూరు లో 45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 44.8, ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టీ)లో 44.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 44.8, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 44.8, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 44.7 డిగ్రీల మేరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.