Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకున్నది. ఆదివారం తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు విజ్రుంభించారు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకున్నది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ ఆశలు సంక్లిష్టంగా మారాయి.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ రాయల్స్ చతికిల పడింది. 59 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో హెట్ మయర్ మాత్రమే 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లెవరూ బెంగళూరు బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్లు పార్నెల్ మూడు, బ్రాస్ వెల్ రెండు, కర్ణ్ శర్మ రెండు, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో డ్యూప్లెసిస్ 44 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 55 పరుగులు, మ్యాక్స్ వెల్ 33 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 54 పరుగులతో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. చివర్లో మెరుపులు మెరిపించిన అనూజ్ రావత్ 11 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేయడంతో బెంగళూరు స్కోర్ 170 పరులు దాటింది. విరాట్ కోహ్లీ 18 పరుగులు చేస్తే, మహిపాల్ లామ్రోర్ ఒక సింగిల్ పరుగు, దినేష్ కార్తిక్ డకౌట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అసిఫ్, అడమ్ జంపా చెరో రెండు వికెట్లు, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.