Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బెంగళూరులో ఆదివారం జరిగి సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం జరిగింది. సీఎల్పీ లీడర్ నియామక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సమ్మతం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్లను పార్టీ అధిష్ఠానం రేపు (సోమవారం) ఢిల్లీ రావాలని పిలిచిందని రిపోర్టులు వెలుడుతున్నాయి. కాగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మల్లికార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించారు. కాగా తదుపరి సీఎం ఎంపికపై ఉత్కంఠ వీడకపోయినప్పటికీ మే 18న (గురువారం) ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.