Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం వొడాఫోన్ రాబోయే మూడేండ్లలో 11,000 ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ రాబడిలో వృద్ధి కొరవడుతుందనే అంచనాతో లేఆఫ్స్ దిశగా నూతన సీఈవో మార్గెరిట డెలా వలె కసరత్తు సాగిస్తున్నారు. తమ వాణిజ్య వేగాన్ని అందుకుని, వనరుల సన్నద్ధత కోసం కంపెనీని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని నూతన సీఈవో చెప్పుకొచ్చారు. తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కస్టమర్లు, నిరాడంబరంగా ఉంటూ మెరుగైన వృద్ధి రేటే తన ప్రాధాన్యతలని ఆమె వివరించారు. మార్కెట్లో పోటీతత్వానికి దీటుగా నిలబడేందుకు సంస్ధను సరళతరం చేస్తామని, కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు అనుగుణంగా వనరులను తిరిగి కేటాయిస్తామని చెప్పారు.
ఇక రాబోయే మూడేండ్లలో 11,000 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు కంపెనీ ప్రాధాన్యతలకు అనుగుణంగా పలు చర్యలు చేపడతారు. కాగా కంపెనీ షేర్ ధరల పతనంతో గత ఏడాది డిసెంబర్లో వొడాఫోన్ సీఈవో నిక్ రీడ్ పదవి నుంచి వైదొలిగారు. మరోవైపు వొడాఫోన్‌లో మాస్ లేఆఫ్స్ టెలికాం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.