Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇప్పటివరకు ఈమెయిల్స్ ను ఇంగ్లీష్‌లోనే పంపించుకున్నాం.. కానీ ఇకపై ఈమెయిల్స్ ను తెలుగులో కూడా పంపించుకోవొచ్చు. ఓ భారతీయ కంపెనీ డేటామెయిల్ పేరుతో ఎనిమిది భారతీయ భాషల్లో ఈమెయిల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటామెయిల్లో కేవలం మెయిల్‌ను తెలుగులో రాయడమే కాదు.. ఈమెయిల్ అడ్రస్‌ను కూడా తెలుగులోనే క్రియేట్ చేసుకోవచ్చు. దేశంలో ఇంగ్లీష్ రాని ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు డేటా గ్సెన్ టెక్నాలజీస్ సీఈవో అజయ్ తెలిపారు. అండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో డేటామెయిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయనన్నారు. డేటామెయిల్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. తెలుగుతో పాటు డేటామెయిల్ హిందీ, గుజరాతీ, ఉర్ధూ, పంజాబీ, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈమెయిల్ సేవలను అందిస్తుంది.