Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1,2,3 పౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి తెలిపారు. స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్ లభించనుందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 23వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. అర్హతలు, ఎంపిక విధానం.. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు మించకూడదు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు రూ. 2 లక్షలకు మించకూడదని, ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలో హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలో పది బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు దాఖలు చేయటకు పూర్తి వివరాలు TSBCSTUDY CIRCLES.CGG.GOV.INలో కానీ 040 24071178 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.