Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీశైలం జలయానికి భారీగా వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 44,136 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 90,848 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగలు కాగా ప్రస్తుతం 884.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 210.99 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29,882 క్యూసెక్కులు విడుదల చేయగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేయగా హంద్రీనీవా ద్వారా 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.