Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్: పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తీసేయడంతో షాకయ్యానని ఆ జట్టు మాజీ సారథి మోయిన్ ఖాన్ అన్నాడు. పీసీబీ ఇటీవల సర్ఫరాజ్‌ను టీ20, టెస్టుల సారథిగా తొలగించిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతడికి టీ20, టెస్టు జట్లలో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మోయిన్ ఖాన్ మాట్లాడుతూ మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్లకు సర్ఫరాజ్‌ను కొనసాగించడం ఇష్టంలేదని చెప్పాడు. వారిద్దరూ పాకిస్థాన్ కెప్టెన్‌ని ఎప్పుడూ ఇష్టపడలేదని అన్నాడు. పీసీబీ అతడిని టీ20 కెప్టెన్‌గా తీసేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అతడు పాకిస్థాన్ జట్టుకు వరుసగా 11 టీ20 సిరీస్‌లు అందించాడు. కొన్ని వైఫల్యాలకే సర్ఫరాజ్‌ను తీసేయడం సరికాదు అని మాజీ సారథి పేర్కొన్నాడు. అలాగే మిస్బాకు రెండు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ఆ జట్టుకు కలిసి రాదని అన్నాడు. ఇదే విషయంపై మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ సర్ఫరాజ్ కెప్టెన్సీ పోగొట్టుకోడానికి ఎవరూ బాధ్యులు కారని, తనకి తానే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని చెప్పాడు. అలాగే అతడిని జట్టులో నుంచి కూడా తీసేస్తారని షోయబ్ స్పష్టం చేశాడు.