Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
నాయీ బ్రాహ్మణులు హిందూ మతంలోని ఒక కులస్థులు. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల జాబితాలో వీరు వర్గం-ఎ లో 16వ కులానికి చెందుతారు. (1) వీరు ఎక్కువగా క్షౌర సంబంధిత వృత్తులలో స్థిరపడ్డారు. రాను రాను గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సవరం చేసి పని తగ్గించి సెలూన్ షాపుల రూపంలో పెట్టుకుని నడుపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య అభ్యసించి ఇతర వృత్తులలో కూడా రాణిస్తున్నారు. సామాజిక వ్యవస్థలో వైద్యులు, ఆరోగ్య సంరక్షకులుగా వ్యవహరించినా, ఉన్నత స్థాయి మాత్రం లభించలేదు. ప్రఖ్యాతి చెందిన వైద్యులు, ఆధునిక కాలంలో వారు సామాజిక స్థాయిని పెంచుకుని ఉద్దేశంతో తమను తాము నాయీ బ్రాహ్మణులుగా వ్యవహరించుకోవడం ప్రారంభించారు. (2) నాయీ బ్రాహ్మణ వారిలో డోలు కళాకారులు, సన్నాయి విద్వాంసులు పూర్వం నుంచి ప్రసిద్ధి. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాయీ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసింది. మంగళ వాయిద్యాలు వాయించేవారు కనుక మంగళి అని పేరు వచ్చిందని పలువురు తెలిపారు.
నేపథ్యం..
మంగళి అనగా మంగళకరమైన వాడు అని అర్థం. పూర్వము వీరు ఆయుర్వేద వైద్యులు. వీరి కుల దైవం 'ధన్వంతరీ'. నాయీ బ్రాహ్మణులు (వైద్యులు)(వైద్య బ్రాహ్మణులు, వాయిద్య బ్రాహ్మణులు), నాయీ బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు ఆధారం సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. సంగీతము, క్షవరము ఆయుర్వేదంలో ఒక భాగము ఒక్కో మంగళి కొన్ని పల్లెలను (సుమారు నాలుగైదు పల్లెలను) తన ఇలాకగా ఉంటాయి. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. అది అతని హక్కు. అది వారసత్వంగా వస్తుంది. వేరొక మంగళి ఆ పల్లెల్లో పని చేయకూడదు. రెండు మూడు రోజలకొకసారి ప్రత్యేకంగా పిలిపించినప్పుడు మంగళి ఆ పల్లెలకు వెళ్లి కావల్సిన వారికి క్రాపు చేయడం, గడ్డం గీయడం, గోళ్లు తీయడం, తలంటి స్నానం చేయించడం, కాలిలో ముల్లు గుచ్చుకుంటే దాన్ని తీయడం మొదలగు పనులను చేయాలి. ఈ పని చేసినందుకు అతనికి ప్రతి రోజు ఏమీ ఆదాయం ఉండదు. రైతు యొక్క స్థాయిని బట్టి అతనికి ఆమేర ప్రతి ఫలం ఇస్తారు. అనగా వరి కోతలప్పుడు అందరి పని వారితో బాటు అనగా చాకలి, వడ్రంగి, కంపాలి, కుమ్మరి మొదలగు వారితో బాటు ఇతనికి ఒక మోపు వరి, నూర్చిన తర్వాత అయిదు బళ్లల వడ్లు ఇవ్వాలి. ఇది అతనికిచ్చే మేర. పెళ్లి వంట శుభ కార్యాలప్పుడు మంగళితో చాలసాంగ్యాలుంటాయి. మంగళ వాయిద్యాలు అవసరమైనప్పుడు రైతు ఆ ఊరి మంగళికి చెప్పాలి. మిగితావారిని అతనే సమకూర్చుకుంటాడు. కాలిలో ముళ్లు గుచ్చుకుంటే దాన్ని మంగళి తీసేవాడు.
అలా పుట్టినదే ఈ సామెత : మంగళిని చూసిన గాడిద కుంటు కుంటు నడిచిందట అనగా తనకు ముళ్లు గుచ్చుకున్నది అని అర్థం.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయము చేయనందున పాత పద్ధతిలో మేర వంటి సౌకర్యం మంగళికి ఇవ్వడం లేదు. వారి పనులకు కూడా రావడం లేదు. అక్కడక్కడా చిన్న పట్టణాల్లో క్షౌర శాలలు పెట్టుకుని కొంత మంది పని చేసుకుంటున్నారు. ఆ నాటి పల్లెల్లో మంగళికి చాకలికి ఉన్నంత పని, గౌరవం ఈ రోజుల్లో లేదు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని నాయీ బ్రాహ్మణులు కోరుతున్నారు.