Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్ నుంచే సీఎం జెండావిష్కరణ
- కోవిడ్ నేపథ్యంలో నిర్ణయం
- ఉదయం 10.30 గంటలకు జిల్లాల్లో మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లు...
- ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరేసేది వారే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఆవిర్భావం నుంచి గతేడాది దాకా పంద్రాగస్టు వేడుకలకు వేదికైన గోల్కొండ కోట ఈసారి ఆ అతిథ్యాన్ని ఇవ్వలేకపోతున్నది. కోవిడ్ - 19 నిబంధనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి బేగంపేటలోని తన నివాసమైన ప్రగతి భవన్ నుంచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు ఆయన జెండాను ఎగురవేయ నున్నారు. ప్రగతి భవన్‌కు చెందిన కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి గతేడాది వరకూ రాష్ట్ర ప్రభుత్వం వరసగా ఆరుసార్లు గోల్కొండ కోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపదాలు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు ఆకట్టుకునేవి. కరోనా ప్రభావంతో ఈసారి వాటికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవంనాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈనెల 15న ఉదయం 10 గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో జాతీయ జెండాను ఆవిష్కరించ నున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడే వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి జిల్లా కేంద్రంలో మంత్రి, ప్రభుత్వ చీఫ్‌విప్, విప్.. ఇలా ఎవరో ఒకరు జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఏ జిల్లాలో ఎవరంటే...
ఆదిలాబాద్ - ప్రభుత్వ విప్ గంప గోవర్థన్
భద్రాద్రి కొత్తగూడెం - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
జయశంకర్ భూపాలపల్లి - ప్రభుత్వ విప్ భాను ప్రసాదరావు
జనగామ - ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు
జోగులాంబ గద్వాల - ప్రభుత్వ విప్ దామోదర్‌రెడ్డి
కామారెడ్డి - స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం - మంత్రి పువ్వాడ అజరు కుమార్
కరీంనగర్ - మంత్రి గంగుల కమలాకర్
కుమరం భీం ఆసిఫాబాద్ - ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
మహబూబ్‌నగర్ - మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబాబాద్ - మంత్రి సత్యవతి రాథోడ్
మంచిర్యాల - ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మెదక్ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మేడ్చల్ మల్కాజ్గిరి - మంత్రి మల్లారెడ్డి
ములుగు - ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు
నాగర్‌కర్నూల్ - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
నల్లగొండ - మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నారాయణపేట - మండలి డిప్యూటీ చైర్మెన్ నేతి విద్యాసాగర్
నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిజామాబాద్ - మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్
రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సంగారెడ్డి - మంత్రి మహముద్ అలీ
సిద్దిపేట - మంత్రి హరీష్‌రావు
సూర్యాపేట - మంత్రి జగదీష్ రెడ్డి
వికారాబాద్ - డిప్యూటీ స్పీకర్ పద్మారావు
వనపర్తి - మంత్రి నిరంజన్ రెడ్డి
వరంగల్ రూరల్ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్ అర్బన్ - ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్
యాదాద్రి భువనగిరి - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి