Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సినిమా థియేటర్ల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, థియేటర్లను వెంటనే తెరిపించాలని సినీనిర్మాత నట్టికుమార్ డిమాండ్ చేశారు. అన్ని రంగాలకు సడ లింపులు ఇచ్చిన ప్రభుత్వాలు థియేటర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో శుక్రవారం నిరసన తెలిపారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు, యూనియన్ గౌరవాధ్యక్షులు ఎన్.మారన్న యూనియన్ కార్యదర్శి అరుణ్ పాల్గొన్నారు.