Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టైప్ రైటింగ్ పరీక్షలు ఈనెల 20న నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. ఈనెల 27, అక్టోబర్ 4 తేదీల్లో షార్ట్ హ్యాండ్ పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం లోయర్, మధ్యాహ్నం హయ్యర్ గ్రేడ్ టైప్‌రైటింగ్ బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని అధికారులు తెలియజేశారు. మాసాబ్ ట్యాంక్, మారేడ్‌పల్లి, రామంతాపూర్, అమీర్‌పేట్ దుర్గాభారు దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ పరీక్షలను చేపడతారు. ఈ మేరకు శనివారం సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.