Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లీ ఫార్మా లిమిటెడ్ తాజాగా సోరియాసిస్ చికిత్స కోసం సహజసిద్ధమైన హెర్బల్ ఆయింట్మెంట్ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ లెసోరిస్ పేరుతో ఈ ఆయింట్మెంట్ను ఆవిష్కరించింది. ఆన్లైన్లో 50 గ్రాముల ట్యూబ్‌తో ఇది లభిస్తుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది ఈ వ్యాధితోతో బాధపడుతున్నారని ఆ సంస్థ అంచనా వేసింది. అన్ని వయస్సుల వారు దీని బారిన పడుతున్నారని పేర్కొంది.