Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయరా?అని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రశ్నించింది. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభ మవుతున్నాయని తెలిపారు.