- రేవంత్‌రెడ్డిపై 4 కేసులు కొట్టేసిన కోర్టు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసులు విచారణ జరిగింది. వేర్వేరు కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హాజర య్యారు. అంతేగాక ఇతర కేసుల్లో హరిప్రియ, కొండా సురేఖ, గూడెం మహిపాల్‌రెడ్డి, ముఠా గోపాల్, సీతక్క కోర్టుకు హాజరయ్యారు.రేవంత్‌రెడ్డిపై నాలుగు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. అసదుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉపసహరించుకుంది. బాజిరెడ్డి గోవర్థన్‌పై ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయకపోవడంతో నిజామాబాద్ రూరల్ ఎస్‌ఐకి కోర్టు సవన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 8న హాజరు కావాలని వనమా వెంకటేశ్వర్‌రావుకు కోర్టు సమన్లు ఇచ్చింది.