Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా ఎన్. వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మీడియా అకాడమి కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ప్రస్తుత కార్యదర్శి ఎమ్.డి. ముర్తుజా నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు అకాడమీ సిబ్బంది కృషి చేయాలని కోరారు. బదిలీపై వెళుతున్న ఎమ్.డి. ముర్తుజాకు పలువురు అధికారులు విడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ ఎమ్. పూర్ణ చందర్రావు, మేనేజర్ ఎ. వనజ, ప్రసాద్, రాజ్ కుమార్, నర్సింహ్మరావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ అభినందన
మీడియా అకాడమిగా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్రావును తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య అభినందించారు. తన విధుల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఎ.మారుతిసాగర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మహ్మద్ ఇస్మాయిల్ కూడా శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు.