Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు టీఏఎఫ్ఆర్సీ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీ కేటగిరీ సీట్ల కోసం కొందరు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం లేదని కొన్ని వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాలపై తమకు ఫిర్యాదులు అందాయని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవేళ అదే జరిగితే ఆ విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. వారి కంటే తక్కువ అర్హత గల విద్యార్థులు సీట్లు పొందే అవకాశముందని వివరించారు. ఏ కాలేజీ యాజమాన్యం తిరస్కరించినా తమ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని విద్యార్థులకు సూచిం చారు. వాటిని ఆయా కాలేజీలకు పంపి స్తామనీ, పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఎంసెట్ కన్వీనర్ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తారని వివరించారు.