Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బానోత్ ధర్మకు సన్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యాపకుడు బానోత్ ధర్మను బుధవారం హైదరాబాద్లో వర్సిటీ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. తన బాధ్యత మరింత పెంచిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి కె సీతారామారావు, అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.