Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ మంత్రికి కాంట్రాక్టర్ల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రెన్యువల్ గడువును ఐదేండ్లకు పొడిగించాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి యస్ కె మాజీద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి తిరుపతి రెడ్డి కలసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లైసెన్స్ రెన్యువల్ గడువును రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచారనీ, దాన్ని ఇప్పుడు ఐదేండ్లకు పెంచాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. దీనివల్ల కాంట్రాక్టర్లు మరింత సమర్ధవంతంగా పనిచేయగలుగుతారని చెప్పారు.