Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణకు ఈ నెల 15,16,17 తేదీలలో మూడు రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలంగాణ నర్సింగ్ స్కిల్ డవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కో ఆర్డినేటర్ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్ విద్యను పూర్తి చేసుకున్న ఎస్సీ విద్యార్థులకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ, విదేశాలకు వెళ్లేందుకు రాసే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్), ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్(ఓఈటీ) పరీక్షలకు ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉచిత శిక్షణకు ఇది వరకే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు కూడా నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని కోరారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు 4 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ, ఇంటర్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, కుల, ఆదాయ సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని వివరించారు. బాటా షోరూం కాంప్లెక్స్, 4వ అంతస్తు, పనామా, వనస్థలిపురం, హైదరాబాద్ చిరునామాలో ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 63091 64343, 98480 47327 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.